కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కాదు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కాదని నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు కరోనా విధుల్లో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు తెలియజేస్తామని లేఖ రాశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సరికాదంటూ సీఎస్ లేఖ రాశారు. నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సాధ్యం కాదని సీఎస్ సాహ్ని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నామని లేఖలో సీఎస్ వెల్లడించారు.













