ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం నిర్మాణానికి నిధులు తదితర అంశాలపై మోదీతో జగన్ చర్చించినట్లు చర్చించారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా రుణాలు తీసుకుంది. మేం సర్దుబాటు చేస్తుంటే కేంద్రం ఆర్థికశాఖ రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. రుణ పరిమితిలో కోతలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని కోరారు. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు పరిష్కరించాలి. మొత్తంగా రూ.32.625.25 కోట్ల పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలి. పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,937.82 కోట్లు వెంటనే చెల్లించాలి. పోలరం పునరావాసానికి రూ.10.485.38 కోట్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ డిస్కలం నుంచి రావాల్సిస రూ.6,886 కోట్లు ఇప్పించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలి. కడపలో నిర్మించనున్న స్టీల్‌ప్లాంట్‌కు ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలి. విశాఖ మెట్రో రైల్ ఏర్పాటుకు సహకారం అందించాలని జగన్ ప్రధాని మోదీని కోరారు.













