ఐఏఎస్ కావాలనుకున్నా… సీఎంనయ్యా !
ఐఏఎస్ అధికారి కావాలనుకున్న తాను ముఖ్యమంత్రి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్ కావాలని అనుకున్నా, అందుకు తగ్గట్టుగా శ్రమించా. కానీ మన కష్టం ఆ స్థాయికి సరిపోదని భావించా. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్లనే నియంత్రించ వచ్చని అనిపించింది. ఎమ్మెల్యే అవుదామని ఇంట్లో పడుకుంటే అయ్యేవాడిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. పాతికేళ్ల వయస్సులో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మాకు ఏం చేయాలో అర్థం కావటంలేదు, మీరు ముఖ్యమంత్రి కావాలని చిన్నతనం నుంచే అనుకున్నారా అని ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభోత్సవ సభలో ఓ యువకుడి అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. కష్టపడ్డాను కనుకే ఈ స్థాయికి వచ్చాను. ఈ స్థాయికి చేరానంటే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, జీవితంలో వచ్ని అవకాశాలను జారవిడుచుకోరాదని యువతకు ఉద్భోధించారు.













