ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా నియమితులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమెతో ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండిరగ్లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రూప్`1, గ్రూప్`2తో పాటు నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై చైర్పర్సన్ అనూరాధ ఆరా తీశారు.













