ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను క్షేమంగా ఏపీకి : వెంకట్ మేడపాటి
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులందరినీ క్షేమంగా రాష్ట్రానికి చేరుస్తున్నామని ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు, ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాల్లోకి వచ్చిన విద్యార్థులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన హంగేరి చేరుకున్నారు. బుడాపెస్ట్‌లో ఉన్న విద్యార్థులను కలిసి దైర్యం చెప్పారు. భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమను పంపిందని తెలిపారు. రాష్ట్రం తరపున అక్కడి విదేశాంగ అధికారులతో మాట్లాడారు. బుడాపెస్ట్ నుండి వెళ్లే విమానాల సంఖ్య తగ్గించారని, వాటి సంఖ్య పెంచితే త్వరగా విద్యార్థులను తీసుకురావచ్చని తెలిపారు.













