రెండు నిమిషాల్లో కరోనా నిర్ధారణ
-అందుబాటులోకి మాస్క్ క్వారంటైన్ బస్సులు
-పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత
-ఇప్పటికే రోజుకు 12వేల పరీక్షలతో తొలిస్థానం
కరోనా నియంత్రణ చర్యల్లో అత్యంత ప్రధానమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంటోన్నా ఆంధ్రప్రదేశ్ తాజాగా అత్యంత వేగంగా పరీక్షలు నిర్ధారణ చేసే ప్రక్రియకు తెరతీసింది. ఇకపై ఇతర రాష్ర్టాల నుంచి రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులకు 2 నిమిషాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యంత సురక్షితమైన పద్ధతుల్లో గంట వ్యవధిలోనే దాదాపు 300మందికి పరీక్షలు నిర్వహించగిలిగే అధునాతన ఐ మాస్క్ క్వారంటైన్ మొబైల్ బస్సులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రముఖ బస్సుల తయారీసంస్థ ‘వీర’ కృష్ణాజిల్లాకు మూడు ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్(ఐ మాస్క్) శాంపిల్ కలెక్షన్ బస్సులను అందించింది. ఇవి జిల్లాలో 30రోజుల పాటు సేవలు అందించనున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఒకటి, రైల్వేస్టేషన్‌కు రెండు కేటాయించారు. వీటిలో శాంపిల్ సేకరణ యూనిట్, ఫ్రంట్‌లైన్ స్టాఫ్ సర్వైలైన్స్ ట్రాకింగ్, మెడికేషన్, హ్యాండ్ అవుట్ తదితర సదుపాయాలు ఉన్నాయి. బస్సు పక్కభాగంలో బయటకు ఉన్న రంధ్రాల దగ్గర నిలబడటానికి వీలుగా బల్లలతో మెట్లను ఏర్పాటు చేశారు. వీటి మీద నిలబడితే రెండు నిమషాలలోనే స్వాబ్ కలెక్షన్ పూర్తి అవుతుంది. విజయవాడ రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ దిగిన ప్రయాణికులతో పాటు విమానాశ్రయంలోనూ దీనిద్వారా నమూనాల సేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.
పరీక్షల్లో, రికవరిలో టాప్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము covid 19 కి సంబంధించిన పరీక్షలను విస్తృతం చేసింది. రోజుకి 12 వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా నిలిచింది. అదేవిధంగా జిల్లాల వారీగా మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందిస్తూ
బుధవారం నాటికి 3200 మంది పాజిటివ్ వచ్చిన వారికి ఆరోగ్య సేవలు అందించి 2209 మందికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపడం జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రపంచంలో 45 శాతం దేశంలో చొప్పున రికవరీ రేటు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 69 శాతం తో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.













