ఆంధప్రదేశ్ మరో రికార్డు

ఆంధప్రదేశ్ రాష్ట్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్‍లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి మరో రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందింది. స్పెషల్ డ్రైవ్‍లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.50 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తంగా 3,00,87,377 మందికి వ్యాక్సిన్ వేశారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలిడోసును 2,16,64,834 మంది వేసుకోగా, రెండు డోసులు వేసుకున్నవారు 84,22,543 మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని డోసులు వస్తే రాబోయే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆంధప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారున. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల సహకారంతో రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.