మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజవారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. తన నివాసానికి ఎవరూ రావద్దని, అత్యవసరమైతే ఫోన్‌లో సంప్రదించాలని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నట్లు తెలిపారు. అవంతికి కరోనా సోకడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 2020లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడ్డారు. అప్పుడు అవంతితో పాటు ఆయన కుమారుడు నందీష్ కూడా కరోనా సోకింది.