నోరు జారీ అడ్డంగా బుక్కైన అంబటి.. అతని ఇంట్లోనే అరెస్ట్..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కథ కొద్దికాలం గా ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చిన సోషల్ మీడియాపై ఏ రేంజ్ లో రచ్చ జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని తమపై తమ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక దీనిపై స్పందిస్తున్న పోలీసు శాఖ ఇటువంటి ఆకతాయి పనులను అరికట్టడానికి కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది అరెస్టు కూడా అయ్యారు.. ఇక మరి కొంతమంది కోసం గాలింపు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాల్లో ముందస్తు సమాచారం అందుకున్న కొందరు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పట్టుకోవడం కాస్త కష్టంగా ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంబటి ఇంట్లో జరిగిన డ్రామా సీక్వెన్స్ మరొక ఎత్తు..
వైసీపీ కి చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్తను.. పోలీసులు అంబటి ఇంట్లోనే అరెస్టు చేయడం సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర హోం మంత్రిగా వ్యవహరిస్తున్న వంగలపూడి అనిత పై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. ఇక అనిత దీనిపై నూజివీడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసు రిజిస్టర్ కావడంతో సదరు రాజశేఖర కోసం నూజివీడు పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు.
అయితే మధ్యలో ఈ వ్యవహారంలో అనవసరంగా తలదూర్చిన అంబటి.. ఖచ్చితమైన ఆధారాలు ఉంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని, అప్పటివరకు ఆ కార్యకర్తకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు.. అంతేకాదు అనవసరంగా పోలీస్ స్టేషన్లకు తిప్పడం, అరెస్టు పేరుతో వేధించే భౌతికంగా హింసించడం వంటి కార్యక్రమాలు జరగకుండా అరెస్టు చేసిన తరువాత కోర్టులో సబ్మిట్ చేయాలి అంటూ అంబటి పేర్కొన్నారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు నేరుగా గుంటూరులో ఉన్న అంబటి నివాసానికి వెళ్లి ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధారాలను చూపించి మరి రాజశేఖర్‌ను అరెస్టు చేశారు.
ఈ విషయం వైరల్ కావడంతో సోషల్ మీడియాలో అంబటి గురించి మీమ్స్ జోరుగా సాగుతున్నాయి.













