పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
విజయవాడలోని సింగ్ నగర్లో మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారు మహిళలకు వేదికపై పట్టాలు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెంబ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ శివనాథ్, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.








