“రణబాలి” – నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’ విడుదల
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’ ఈ రోజు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో చరిత్రలో బ్రిటీషర్స్ మనకు తెలియకుండా ఇంటెన్షనల్ గా కనుమరుగు చేసిన నిజాలు ఏంటి, అన్నపూర్ణగా వెలిగిన మన దేశపు ధాన్య సిరులను రైల్వేల నిర్మాణంతో బ్రిటీషర్స్ ఎలా దోచుకుపోయారో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక తెలిపారు.
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – చరిత్రలో మనకు కొన్ని సత్యాలు తెలియలేదు అంటే అందుకు కారణం బ్రిటీషర్స్ ఆ నిజాలు మనకు తెలియకుండా చేయడమే. మనం కూడా వాటి గురించి పెద్దగా చర్చించుకోలేదు. ఈ సినిమా కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ కాలం గురించి, అప్పటి పరిస్థితులు, ప్రజల గురించి లోతుగా తెలిసింది. అసలు అప్పుడేం జరిగింది అని తెలిసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – మన స్నేహుతులు కొందరు బ్రిటీషర్స్ మనకు కొన్ని మంచి పనులు చేశారు. ఇండియన్ రైల్వేస్ ను బ్రిటీష్ వాళ్లు మనకు నిర్మించి ఇచ్చారని చెబుతుంటారు. వాళ్లు రైల్వే లైన్స్ నిర్మించారని చెబుతారు గానీ ఎందుకు నిర్మించారో దాని వెనక వాళ్ల స్వార్థం ఏంటో తెలియకుండా బ్రిటీషర్స్ చేశారు. మనకు అప్పట్లో చరిత్ర అంటే వాళ్లు (బ్రిటీషర్స్) చెప్పేదే. మన వాళ్ల శ్రమతో బ్రిటీషర్స్ వాళ్ల స్వార్థం కోసం నిర్మించుకున్నదే ఇండియన్ రైల్వేస్ అని తర్వాత నేను తెలుసుకున్నాను. భౌగోళికంగా చూస్తే మన దేశం చాలా విశాలమైంది. మనకు కావాల్సినంత సేద్యపు భూమి అందుబాటులో ఉంది. వాళ్లు మన పంటలను వీలైనంత త్వరగా పోర్టులకు తరలించి, అక్కడి నుంచి బ్రిటన్ కు తీసుకెళ్లేందుకు రైల్వే ట్రాక్స్ ఉపయోగపడ్డాయి. ట్రిలియన్స్ డాలర్స్ విలువైన ధాన్యం, పత్తి, మసాలా దినుసులు, బంగారం ఇండియన్ రైల్వేస్ ద్వారా బ్రిటీషర్స్ తరలించారు. మన వనరులన్నీ బ్రిటీషర్స్ దోచుకున్నారు. అన్నారు.
అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కు రాబోతోంది. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.








