ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్
రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘వేల్’. ఈ చిత్రాన్ని క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ జి. అశోక్ (రాజు), వై మురళి(రాజు) నిర్మిస్తున్నారు. డైరెక్టర్ నాగేంద్ర ఆవుల రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో ‘వేల్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ – ఈ సినిమా మొత్తం గోవాలో చిత్రీకరించారు. ప్రతి సీన్ ఎక్కడా ల్యాగ్ లేకుండా వెళ్తూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ కథలో అనేక కోణాలు ఉన్నాయి. స్టోరీలోని ఎలిమెంట్స్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
హీరోయిన్ అమృత శ్రీవాత్సవ మాట్లాడుతూ – నేను మిస్ ఇండియా విన్నర్ అయ్యాక మిస్ వరల్డ్ పోటీలకోసం సన్నద్ధమవుతూ వచ్చాను. ఆ క్రమంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. నాకు దక్షిణాది చిత్రాలు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇలాంటి ఇండస్ట్రీలో నేనూ భాగమవ్వాలని కోరుకున్నా. ఈ చిత్రంలో నాయికగా నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశారు. త్వరలోనే మా మూవీ మీ ముందుకు రాబోతోంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరో రవిచంద్ర మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. మాది స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ. హిట్ కొడుతున్నాం అనే నమ్మకం మాలో ఉంది. ఈ సినిమాలో యాక్షన్ , రొమాన్స్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాను డే అండ్ నైట్ షెడ్యూల్స్ లో మా డైరెక్టర్ గారు కష్టపడి రూపొందించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ఆదిత్య మాట్లాడుతూ – ఒక మనిషి తనకు కావాల్సిన పనులు చేయించుకోవడం కోసం ఎలాంటి మసుగులు వేసుకుని ప్రవర్తిస్తున్నాడు అనే పాయింట్ తో మా డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్ట్స్ సీన్ ఎం జరుగుతుంది అనేది ఊహించలేం. సినిమా మంచి పేస్ తో వెళ్తూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇలాంటి మంచి మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది. మా మూవీ ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్న చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ – మా మూవీ ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ కారణం. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే కథను బాగా తెరకెక్కించగలిగాం. ఈ సినిమాకు ఏం కావాలన్నా ఆయన సమకూర్చారు. మా సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. మా టీమ్ అంతా కంప్లీట్ గా సపోర్ట్ చేసి క్వాలిటీ మూవీ చేసేందుకు కష్టపడ్డారు. మా హీరోలు, హీరోయిన్ ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు ఈ చిత్రాన్ని ప్యాషనేట్ గా నిర్మించారు. ఆయనలాంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం. ఇద్దరు యంగ్ ఎనర్జిటిక్ హీరోలు రవితేజ, ఆదిత్య ఈ చిత్రంలో నటించారు. మిస్ ఇండియా అమృత హీరోయిన్ గా మనల్ని ఆకట్టుకోనుంది. ట్రైలర్ చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ బాగా నటించారు. డైరెక్టర్ నాగేంద్ర పగలూ రాత్రీ షెడ్యూల్స్ లో తక్కువ టైమ్ లో ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మించారని తెలిసింది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.








