వీళ్లు ఆచార్యులా? వైసీపీ కార్యకర్తలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భజన చేయడంలో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు వైసీపీ కార్యకర్తలకు మించిపోయారు. యూనివర్సిటీల్లోని ఆచార్యుల ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్కు భజన చేసేందుకు ఆచార్యులు పోటీ పడ్డారు. వీసీ రాజశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ఉపకులపతి కార్యాలయం నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ తతంగాన్ని చూసిన విద్యార్థులు వీళ్లు ఆచార్యులా? వైసీపీ కార్యకర్తలా? అంటూ నోళ్లు వెళ్లబెట్టారు.













