పాలన చేతగాకపోతే దిగిపోవాలి.. అంతేకానీ
గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శమని తెలిపారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలని, అంతేకానీ పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదని అన్నారు. స్విచ్ వేయకుండానే ప్రజలకు జగన్ విద్యుత్ షాక్‌లకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికి ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4.400 కోట్ల భారం పడనుందని తెలిపారు. జగన్ తన చేతగానితనంతో ఓ వైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రజలపై పెనుబారం మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.













