టీడీపీ హయాంలోనే దేశంలోనే అగ్రస్థానంలో.. నేడు

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండిందని, నేడు జగన్ రెడ్డి చర్యలతో పతానావస్థకు చేరిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని జగన్ హామీ ఇచ్చి రైతులను వంచిచారని విమర్శించారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్రెడ్డి నిండా ముంచారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదేం ఖర్మ ఆక్వా రైంతానికి పేరుతో చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుందని తెలిపారు. ఈ సమావేశానికి ఆక్వా రైతులు, ఆక్వా రైతు సంఘం నాయకులు హాజరవుతారని తెలిపారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను చంద్రబాబు ప్రకటిస్తారని వెల్లడించారు.











































































