రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు

రానున్న ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తెలిసే హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని విమర్శించారు. ప్రశ్నించిన వారిని హింసించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటారని తెలిసి కూడా ఓట్లు వేశారనిపిస్తోందని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి పోరాడుదామన్నారు.











































































