మూడేళ్ల పాలనలో కనీసం.. మూడు పరిశ్రమలైనా తెచ్చారా?

సీఎం వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో కనీసం మూడు పరిశ్రమలైనా తెచ్చారా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను తాను తెచ్చినట్లు జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని జగన్ ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలకు భూములిస్తున్నారని చంద్రబాబుపై విషప్రచారం చేసిన జగన్, నేడు అదే భూముల్లో జగన్ శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. సీఎం దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనమేమీ లేదన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో పరిశ్రమలను వెళ్లగొట్టడం, కక్షసాధింపులతో ఇళ్లు పడగొట్టడం తప్ప జగన్ సాధించిందేంటి అని ప్రశ్నించారు.











































































