Buddhaprasad: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో డీఎస్సీ క్యాలిఫైడ్ అభ్యర్థులు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు (Srinivasa Rao) తదితరులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) జారీ చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్ (Jagan) ఐదేళ్ల పాటు యువతను మోసం చేశారన్నారు. గతంలో తొమ్మిది సార్లు డీఎస్సీ ఇచ్చిన ఘనత, కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.