‘వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ’ సేవల విస్తరణ
క్యాంప్ కార్యాలయంలో ‘వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ’ సేవల విస్తరణ కార్యక్రమం. “వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే పరిస్థితి ఏ మనిషికి రాకూడదు అనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం.“ నేటి నుండి కొత్తగా మరో 6 జిల్లాల్లో 2056 వైద్య ప్రక్రియలు అమలు కానున్నాయి. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆరోగ్య శ్రీ అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే వైయస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు. కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.













