టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణం స్వీకారం చేశారు. నలుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. వీరిలో తుడ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యులుగా సుదర్శన్ వేణు, నేరును నాగసత్యం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. స్వామివారి దర్మనానంతరం బోర్డు సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని జేఈఓ వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈఓలు లోకనాథం, గోవిందరాజన్, హరీంద్రనాథ్ విజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













