శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం వార్షిక వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఏటా ఆలయ సమీపంలోని వసంత మండపంలో ఈ ఉత్సవాలను నిర్వహించేవారు. ఏటా ఆలయ సమీపంలోని వసంత మండంలో ఈ ఉత్సవాలను నిర్వహించే వారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చని ఈవో సింఘాల్ తెలిపారు.













