విజయవాడ. లో అగ్నిప్రమాదం 10 మంది కరోనా పేషెంట్స్ మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్ హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. ఈ కోవిడ్ సెంటర్లోని బాధితులకు రమేష్ ఆస్పత్రి చికిత్స అందిస్తోంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలసమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ హోటల్‌ను చికిత్సా కేంద్రంగా మార్చిన రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన అనుమతులకు సంబంధించిన అంశాలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా కరోనా పేషెంట్ల వద్ద రమేష్ ఆస్పత్రి యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా పేషెంట్ల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సైతం ఇచ్చినట్లు అధికారులు కూడా తెలుసుకున్నారు కాగా, ప్రమాద సమయంలో కోవిడ్ సెంటర్లో 30 మంది భాధితులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి తక్షణమే మృతుల కుటుంబాలకు 50లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పూర్తి నివేదిక వచ్చిన వెంటనే బాద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వ్యవహరిస్తోంది. మరోవైపు ఈ అగ్రి ప్రమాదంపై ప్రధాన మంత్రి మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.













