సచిన్ టెండూల్కర్ ఉదారత!
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ తన జీతం మొత్తం ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. గత ఆరేళ్లుగా ఆయన దాదాపు రూ.90 లక్షలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు అందుకున్నారు. సచిన్ చేసిన సాయంపై ప్రధానమంత్రి కార్యాయలం (పిఎంఒ) కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేసింది. సచిన్ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ తన లేఖలో పేర్కొంది. ఈ నెల 28తో సచిన్ రాజ్యసబ ఎంపీ పదవీ కాలం ముగియనుంది. 2012 ఏప్రిల్లో సచిన్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.













