ప్రణబ్ ముఖర్జీతో మోదీ భేటీ
ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్కా సాథ్.. సబ్ కా వికాస్..సబ్కా విశ్వాస్ సాకారం కావాలని ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్‌తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ప్రణబ్ దాదాతో ఎప్పుడు కలిసాన అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీ భేటీ ఆహ్లాదంగా సాగిందని, ఆయన రెండవ పర్యాయం ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు.













