ఏపీ టీచర్లకు జాతీయ అవార్డులు
వృత్తిలో నిబద్ధత కనబరిచిన ఆంధ్రప్రదేశ్ టీచర్లకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీరికి అవార్డులు అందించారు. అవార్డు గ్రహీతల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు గోరంట్ల శ్రీనివాస రావు (బీకే పాలెం, గుంటురుజిల్లా), చిలుకూరి శ్రీనివాసరావు (కడియం, తూర్పుగోదావరి), నెల్లబోయిన విమలాకుమారి (పాములపాడు, గుంటూరు), యెర్ర ఎస్ఎస్జీఎస్ చక్రవర్తి (మారెడుపూడి, విశాఖపట్నం), గొట్టేటి రవి( ఎండాడ, విశాఖపట్నం), చాగంటి శ్రీనివాసరావు (మానుకొండువారిపాలెం, గుంటూరు)తో పాటు సెకండరీ స్కూలు టీచర్లు బొంతలకోటీ శంకర్రావు (బీసీ పెంట, విజయనగరం), డి.ధర్మ రాజు ( చాగల్లు, పశ్చిమగోదావరి), రెడ్డి లోనానందరెడ్డి (త్యాజంపూడి, పశ్చిమగోదావరి) ఉన్నారు.













