విశాఖలో టీమిండియాకు ఘన స్వాగతం
ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్లో భాగంగా భారత క్రికెటర్లు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ మేరకు విశాఖ ఎయిర్పోర్టులో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. క్రికెటర్ల రాక తెలుసుకున్న అభిమానులు వారికి సాదర స్వాగతం పలికారు. ఎయిర్ ఇండియా విమానం లో భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండా, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్ తదితరులు నగరానికి చేరుకన్నారు. కాగా, ఆస్ట్రేలియా జంటు శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. ఆసీస్తో రెండు టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఆదివారం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.













