ప్రైవేటు రైళ్లకు త్వరలో గ్రీన్ సిగ్నల్
ప్రైవేటు కంపెనీలు సరుకు రవాణాకు రైల్వే నెట్ వర్క్‌ను వినియోగించుకుని… వారి రైళ్లను నడిపించుకునేందుకు అవకాశం కలుగబోతోంది. వారు రైల్వే ట్రాక్‌ను వినియోగించుకున్నందుకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రైల్వే డెవలప్మెంట్ అథారిటీ రూపొందిస్తుంది. ఇందుకయ్యే ఛార్జీలను కూడా నిర్ణయిస్తుంది. గత ఏప్రిల్‌లో క్యాబినెట్లో రైల్వే డెవలప్మెంట్ అథారిటీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ట్రాక్ ఎక్సెస్ ఛార్జీని డెడికేటెడ్ ఫ్రంట్ కారిడార్‌తో పాటు భవిష్యత్‌లో నిర్మించబోయే కారిడార్లను అనుసరించి నిర్ణయిస్తారు. ప్రభుత్వం త్వరలో మూడు కారిడార్లను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. రైల్వే డెవలప్మెంట్ అథారిటీ ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రకటించింది.
రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఆర్ సి ఆచార్య రైల్వేలో ప్రైవేటు పెట్టుబడుల గురించి చెప్పారు. ఇంగ్లాండ్‌లో ఒక దశాబ్ధం కిందటే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అక్కడి రైల్వే వ్యవస్థ అనేక విజయాలు సాధించిందన్నారు. రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించారని అన్నారు. అయితే భారత్‌లో రైల్వేల ప్రైవేటీకరణపై రైల్వే సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.













