బంపర్ ఆఫర్ ప్రకటించిన గో ఎయిర్
గో ఎయిర్ విమానయాన సంస్థ మరోసారి బంపర్ ఆఫర్లకు తెరలేపింది. 10 లక్షల సీట్లను అతిచౌక ధరలకు అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్ ప్రారంభ ధర రూ.1099లుగా ఖారారు చేసిన గో ఎయిర్, పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.250 రాయితీ లభిస్తుందని ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ పేరుతో ఆగస్టు 4న (శనివారం) నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఆగస్టు 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ టిక్కెట్లపై ఆగస్టు 4 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రయాణించవచ్చని గో ఎయిర్ తెలిపింది. తమ వెబ్సైట్, మొబైల్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.300 వరకు ప్రత్యేక డీల్స్ ఉన్నట్లు ప్రకటించింది.













