చందా కొచ్చర్ కు ఉడ్రో విల్సన్ పురస్కారం
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్ ప్రతిష్ఠాత్మక ఉడ్రో విల్సన్ పురస్కారం అందుకున్నారు. గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్షిప్ విభాగంలో ఆమెకు ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ మహిళ కొచ్చర్యే కావడం విశేషం. ఇంతకు ముందు భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఐటీ దిగ్గజయం ఎన్ఆర్ నారాయణ మూర్తిలు ఉన్నారు. భారతీయ మహిళలు, ఐసీఐసీఐ గ్రూప్ తరపున తాను ఈ అవార్డు అందుకుంటున్నట్టు చందా కొచ్చర్ తెలిపారు. గత కొన్నేళ్లలో పలు దాతృత్వ ప్రాజెక్టులను అమలు చేశామని, 1,36,000 మందికి పైగా నైపుణ్యాలు కల్పించామని కొచ్చర్ చెప్పారు. ఇంతకు ముందు ఈ అవార్డు అందుకున్న ప్రతిభావంతుల సరసన చేరడం గొప్ప విషయమని అన్నారు.













