బంకుల్లెక్క ఛార్జింగ్ పాయింట్స్ : ఎలక్ట్రిక్ కార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పొల్యుషన్ కు చెక్ పెట్టడంతో పాటు ఇందనాన్ని ఆదా చేసేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు బిడ్లను వేసింది. ఈ ఏడాది నవంబర్ కల్లా దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ కార్లలో తిరగన్నాయి. ముందుగా 1,000 ఎలక్ట్రిక్ కార్లను మంత్రులు, అధికారులకు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఇంధన దిగుమతిలో మూడో స్ధానంలో ఉన్న భారత్.. ఆ భారం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది.
ఆలోచనను కార్యాచరణలో పెడుతూ.. ప్రభుత్వం నుంచే మార్పుకు నాంది పలికేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం నేషనల్ కేపిటల్ రీజయన్(NCR) పరిధిలో 400లకు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తూ అత్యధికంగా ఇంధనాన్ని ఆదా చేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 10 వేల ఎలక్ట్రిక్ కార్లకు టెండర్లను ఆహ్వానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
కార్ల కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) శుక్రవారం (ఆగస్టు 18)బిడ్లను ఆహ్వానించింది. పెట్రోల్ బంకుల దగ్గర ఎల్ఈడీ విద్యుత్తు దీపాల అమ్మకానికి EESL, పెట్రోల్ బంకుల యాజమాన్యాల మధ్య అగ్రిమెంట్ కుదిరిందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా 1,000 ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని EESL ఎండీ సౌరభ్‌కుమార్ తెలిపారు. ఒకసారి చార్జ్ చేస్తే 120-150 కిలోమీటర్ల మైలేజ్‌ను ఎలక్ట్రిక్‌కార్లు ఇస్తాయని చెప్పారు. ఈ కార్లకు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు.













