ట్రంప్ ప్రతిపాదన… తెలుగు ఎన్ఆర్ఐలు ఆందోళన
హెచ్ 4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ట్రంప్ నిర్ణయాన్ని తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంఘం ఖండించింది. కొత్త విధానం వల్ల అమెరికాలో నివసిస్తున్న అనేక మంది తెలుగువారిపై ప్రభావం ఉంటుందని ఆ సంఘం ఆరోపించింది. వర్క్ పర్మిట్‌ను ఎత్తివేస్తూ తీసుకోబోయే నిర్ణయాన్ని అమలు చేయరాదు అని ఎన్ఆర్ఐ సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర అధికారులకు ఆ సంస్థ తమ సమస్యను తెలుపాలనుకుంటున్నది. హెచ్ 4 వీసాదారులు పనిచేసుకునేందుకు గతంలో ఒబామా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ ప్రతిపాదనను ఎత్తివేయాలనుకోవడంతో పరిస్థితి తారుమారైంది.













