ఉల్ఫాతో కేంద్ర ప్రభుత్వం… చరిత్రాత్మక ఒప్పందం
యునైటెడ్ లిబరేషేన్ ఫ్రంట్ ఆఫ్ అసాం (యూఎల్ఎఫ్ఏ)తో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది. కేంద్రం, అస్సాం ప్రభుత్వం ఉల్ఫా మధ్య ఈ ఒప్పందం జరిగింది. ముగ్గురూ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న మారణకాండకు ముగింపు నేడు అవకాశాలు తెలుస్తోంది.
అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా కొనసాగుతున్నది. అయితే ఆ దళంతో ఒప్పందం చేసుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్చలకు పరేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా స్వతంత్య్ర గ్రూపు దూరంగా ఉంది. అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అసాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్సు ఉంది. దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆఫ్సా లాంటి ప్రత్యేక చట్టాలను తొలగించామని, దీని ఉద్దేశం అస్సాంలో తిరుగుబాటు తగ్గినట్లే అవుతుందని షా అన్నారు. ఉల్ఫా ప్రతినిధులు, అస్సాం సీఎం బిశ్వశర్మ, అమిత్ షా సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.













