ఆ పంచ్ మామూలుగా లేదుగా…!
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై రాజ్ నాథ్ తనదైన పంచ్ లు విసిరారు. 1947లో భారత్ విడిపోయిందని.. భారత్ ను జోడించేందుకు బహుశా రాహుల్ గాంధీ కరాచీ లేదంటే లాహోర్ వెళతారని అనుకున్నానని.. కానీ తాను ఊహించినట్లుగా ఆయన వెళ్లలేదన్నారు. కర్ణాటకలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ పై రాజ్ నాథ్ పంచ్ లు వేశారు.
విపక్షంలో ఉన్న వేళలో బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ఇటీవల కాలంలో ఆయనలో ఆ జోష్ తగ్గిందన్న మాట వినిపిస్తూ ఉంది. తన పని తాను చేసుకుంటూ పోతున్న ఆయన నోటి నుంచి అనూహ్య వ్యాఖ్య ఒకటి వచ్చింది. అదీ రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్య మామూలుగా లేదు…రాజ్నాధ్ సింగ్ పంచ్ ఎలా ఉంటుందో మళ్ళీ రుచి చూపించింది.













