కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం…
కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. శాసనసభలో ఇకపై మామా అల్లుళ్లు కనిపించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన పినరయి విజయన్ ముఖ్యమంత్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన అల్లుడు పి.ఎ.మహమ్మద్ రియాస్.. కోజికోడ్‌లోని వామపక్షాల కంచుకోట బేపోర్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రజాతంత్ర యువజన సమాఖ్య జాతీయాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. విజయన్ కుమార్తె వీణ బెంగళూరులో ఐ.టి.రంగ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. విజయన్ కూతురు వీణ, రియాస్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం.













