గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామ్ అధ్యక్షుడు
దేశ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామ్ అధ్యక్షుడు, భారత్ సంతతికి చెందిన చంద్రికా పర్సాద్ సంతోఖి హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గడచిన వారం ఆన్లైన్లో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలోనూ సంతోఖి ప్రసంగించారు. భారత్ నుంచి సురినామ్‌కు వచ్చే సందర్శకులకు వీసా అనుమతులను రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సందర్శకుల రవాణాను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.













