హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌గా రోష్నీ నాడార్
దేశీయ ఐటీ సేవల దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ నాడార్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ స్థానంలో ఆయన వారసురాలు రోష్నీ నాడార్ మల్హోత్రా నియమితులయ్యారు. దేశీయ మహిళా సంపన్నురాలైన రోష్నీ 9.9 బిలియన్ డాలర్ల విలువైన సంస్థకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన దేశీయ ఐటీ సంస్థకు అతి పిన్న వయస్సురాలైన (38 ఏండ్ల) మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్లాసికల్ మ్యూజీషియన్ శిక్షకురాలైన ఆమె.. 2013లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ బోర్డు డైరెక్టర్‌గాను, ఆ తర్వాతి క్రమంలో వైస్ చైర్మన్‌గా పదొన్నతి పొందారు. అయినప్పటికీ హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవోగా ఆమెనే కొనసాగనున్నారు. మరోవైపు శివ నాడర్ చైర్మన్ నుంచి వైదొలిగినప్పటికీ మేనేజింగ్ డైరెక్టర్‌గాను, ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.













