టీమ్ఇండియానే నెంబర్ వన్…టెస్టుల్లో

భారత క్రికెట్ టీమ్ మళ్ళీ తన సత్తా చాటుకుంది. ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో తానే నెంబర్ వన్ అని మరోసారి చాటుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్‍వన్ ర్యాంకును పదిలం చేసుకుంది. న్యూజిలాండ్ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జూన్‍లో ప్రపంచటెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన భారత్..స్వదేశంలో ఇంగ్లాండ్‍పై 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.