పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మాన్చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. కాగా 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం. పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆప్ 92 స్థానాల్లో గెలుపొందగా పాలక కాంగ్రెస్ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకుని పరాజయం మూటగట్టుకుంది.













