21న ప్రధాని మోదీ ప్రసంగం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతీ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయూష్ మంత్రిత్వశాఖ ఈ ఏడాది థిమ్గా యోగా ఎట్ హోం, యోగా విత్ ఫ్యామిలీ ని ప్రమోట్ చేస్తుంది. ఈ ఏడాది కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి యోగాను ప్రాక్టీస్ చేయాల్సిందిగా సూచించింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యోగా ద్వారా శరీరాన్ని అదేవిధంగా మనస్సును ధృడంగా ఉంచుకోవచ్చంది. వ్యాధిపై పోరాడేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది.













