ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్గజరీ రిస్టార్ట్‌లో జూన్ 13-15 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జపాన్, కెనడా ప్రధానులు పుమియో కిషిదా, జస్టిస్ ట్రూడో తదితర నేతలు దీనికి హాజరుకానున్నారు. ఈ సమావేశం నిమిత్తం జూన్ 13న ప్రధాని మోదీ ఇటలీ వెళ్లి, 14వ తేదీ రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.