ప్రధాని మోదీతో పవన్.. అకీరాను

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నాలెజినోవా కొణిదెలతో పాటు తన కుమారుడు అకీరా నందన్‌ను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి చేసి మోదీ మాట్లాడుతున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.