పేపర్ పాస్‌పోర్ట్ ల స్థానంలో.. డిజిటల్ పాస్‌పోర్ట్ లు : కేంద్రం
పాస్‌పోర్ట్ విధానంలో సరికొత్త మార్పలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాత కాలం నాటి పేపర్ పాస్‌పోర్టుల స్థానంలో కొత్త డిజిటల్ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే చిప్ అధారిత పాస్‌పోర్టును జారీ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాలు చిప్ అధారిత పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటిని క్యారీ చేయడం తేలిక అదే విధంగా ట్యాంపర్ చేయడం కష్టం. మన్నిక, భద్రత విషయంలో చిప్ పాస్‌పోర్టులు సాధారణ పాస్‌పోర్టు కంటే ఎంతో మెరుగుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.













