Budget Session: పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు షురూ.. స్పీకర్‌పై అవిశ్వాసం!
కేంద్ర బడ్జెట్ (Budget Session) సమావేశాల రెండో విడత నేడు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహరచన చేశాయి.
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..
సభ (Budget Session) ప్రారంభమైన వెంటనే స్పీకర్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన (అవిశ్వాస) తీర్మానం చర్చకు రానుంది. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదనే కారణంతో 118 మంది ప్రతిపక్ష ఎంపీలు ఫిబ్రవరి 13న ఈ నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చ ముగిసి, ఓటింగ్ పూర్తయ్యే వరకు ఓం బిర్లా స్పీకర్ కుర్చీలో కూర్చుని సభను నడిపే అవకాశం ఉండదు. సభలో చర్చ జరిగే సమయంలో ఆయన సాధారణ సభ్యుల మధ్య కూర్చుని తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు డిమాండ్..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలపై (Middle East Crisis) సభలో (Budget Session) స్వల్పకాలిక చర్చ జరపాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, వారి ఉపాధిపై పడే ప్రతికూల ప్రభావంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాయి.
ఆర్థిక బిల్లుల ఆమోదం..
ఈ రెండో (Budget Session) దశ సమావేశాల్లో ప్రధానంగా వివిధ మంత్రిత్వ శాఖల పద్దులు, వ్యయాలపై లోతైన చర్చలు జరిపి కేంద్ర ఆర్థిక బిల్లులకు సభ ఆమోదం తెలపాల్సి ఉంది. వీటితో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక అంశాలు, ఇతర బిల్లులను కూడా ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. ప్రభుత్వ బిల్లుల ఆమోదం, ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఈ దఫా సమావేశాలు తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నాయి.
ఇవి కూడా చదవండి







