భారత్ కు ప్రవాస భారతీయులు విరాళం…

కరోనా భారత్‍ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తెలుగు టెక్కీలతో పాటు ఐటీ సర్వ్ అలయెన్స్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ టెక్కీలు సాయానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ రెడ్‍క్రాస్‍కు ఒక్కొక్కటి 5 వేల డాలర్ల విలువ కలిగిన పది ఆక్సిజన్ వెంటిలేటర్లు అందించారు. మరో 200 ఆక్సిజన్ కాన్‍సంట్రేటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో డిమాండ్, అవసరాన్ని బట్టి అందజేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి 500 డాలర్లతో ఆక్సిజన్ కాన్ సంట్రేటర్లను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో తక్షణం సాయంగా ఉండేందుకు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్క రోజే సుమారు కోటి రూపాయల విరాళాలు ఐటీ ఉద్యోగులు సేకరించారు.