బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణ స్వీకారం
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నీతీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్తోపాటు మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో బీజేపీ శాసనసభాపక్ష నేత తార్కిషోర్ ప్రసాద్ మరో సీనియర్ బీజేపీ నేత రేణుదేవి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేణుదేవి బీజేపీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు నీతీశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునీల్ కుమార్ మోదీ స్థానంలో తార్కిషోర్ ప్రసాద్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. మరోవైపు సుశీల్ కుమార్ మోదీని మాత్రం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ సభ్యులు గైర్హాజరయ్యారు.













