9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం..

భారత ప్రధానిగా వరుసగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పా్ట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా రాష్ట్రపతి భవన్లో భద్రత సమీక్ష నిర్వహించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా చోట్లు ప్రోటోకాల్ కూడా అమలు చేస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నోఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూన్ 9,10 తేదీల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, డ్రోన్ , గాలి బుడగలు, రమోటెడ్ ఎయిర్ క్రాప్ట్లు ఎగురవేయడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.