ఇదో గొప్ప న్యూస్ .. ప్రధాని మోదీ హర్షం
భారత్లో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. ఈ విషయం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదో గొప్ప న్యూస్ అని అయన అన్నారు. దేశంలో చిరుత పులుల సంఖ్య 12,852 చేరినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ వార్త పట్ల ప్రధాని మోదీ తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. గ్రేట్ న్యూస్, సింహాలు, పులుల తర్వాత చిరుతల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన కంగ్రాట్స్ చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలనే ఎప్పటికీ కొనసాగించాలని, సురక్షితమైన పరదేశాల్లో జంతువులు ఉండేలా చూడాలన్నారు. 2014లో దేశంలో కేవలం 7910 మాత్రమే చిరుత పులులు ఉండేవి. అయితే 60 శాతం కన్నా ఎక్కువ జనాభా రికార్డు అయింది. మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది.













