దేశ ప్రజలకు గుడ్ న్యూస్… ఇంతలా రికవరీ కావడం ఇదే ప్రథమం….

కేంద్ర ఆరోగ్య శాఖ దేశ జనులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, 24 గంటల్లోనే 4 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో మంగళవారం నాటికి పాజిటివిటీ రేటు 14.10 శాతంగా ఉందని ఆయన ప్రకటించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, మే 2 నాటికి రికవరీ రేటు 85.60 శాతంగా ఉందన్నారు. ఒక్క రోజులోనే ఇంతలా కోలుకోవడం ఇదే ప్రథమం.
గత 14 రోజులుగా సగటున రోజుకు 3,55,944 మందికి పైగా రికవరీ అవుతున్నారని, గడచిన 5 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నాయని ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 50 వేల మంది నుంచి లక్ష మధ్య పది రాష్ట్రాలు, 50 వేల కన్నా లోపు యాక్టివ్ కేసుల్లో 18 రాష్ట్రాలున్నాయని తెలిపారు. 199 జిల్లాల్లో వైరస్ పాజిటివ్ కేసుల తగ్గుదల కనిపించిందని, గత మూడు వారాల నుంచి పాజిటివ్ రేటు కూడా తగ్గిందన్నారు.