వెనక్కి తగ్గిన అగ్రరాజ్యం…
అగ్రరాజ్యం అమెరికా వెనక్కి తగ్గింది. భారత్ ముందస్తు అనుమతి లేకుండా భారత ప్రదేశిక జలాల్లో నేవీ ఆపరేషన్ నిర్వహించిన యూఎస్.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము ఈ పని చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇండియా అనుమతి అవసరం లేదని అహంకారంగా మాట్లాడింది. అయితే ఇప్పుడా దేశం కాస్త వెనక్కి తగ్గుతూ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7న యూఎస్ నేవీ 7వ ఫ్లీట్‌లో భాగమైన యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్, హిందూ మహా సముద్రంలో రొటీన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ నిర్వహించింది. అంతర్జాతీయ చట్టాలకు, ప్రపంచవ్యాప్తంగా సముద్రాల స్వేచ్ఛకు అమెరికా మద్దతు తెలపడంలో భాగంగా ఈ పని చేశాము. వివిధ అంశాల్లో మేము భారత భాగస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఇండోపసిఫిక్‌లో ప్రాంతీయ భద్రత కూడా అందులో భాగం అని అమెరికా రక్షణణ శాఖ అధికారి ప్రతినిధి అన్నారు.













