చరిత్ర సృష్టించిన గోపీచంద్.. అంతరిక్షంలోకి భారత్!

తెలుగు తేజం గోపీచంద్ తోటకూర రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేటు సంస్థ బ్లూ ఆరిజన్ రూపొదించిన న్యూషెపర్డ్`25 వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లడం పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి భారత్ అంటూ గోపీ వ్యోమనౌక నుంచి చెప్పిన మాటలను బ్లూ ఆరిజన్ సంస్థ తెలిపింది. ఈ వీడియలో ఆయన నేను మన సుస్థిర భూగోళం కోసం పోరాడుతున్న యోధుడిని అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ, అంతరిక్షం నుంచి సందేశమిచ్చారు. ఆ తర్వాత భారతీయ జాతీయ పతకాన్ని పట్టుకుని కనిపించారు. ఈ యాత్రలో గోపీచంద్‌తో పాటు మేనస్ ఏంజెల్, సిల్వైన్ చిరోన్, కెన్నెత్ ఎల్ హెస్, కరోల్ షల్లర్, ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు.